కలం, వెబ్ డెస్క్ : వచ్చే జూన్ నాటికి ఏపీని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మారుస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu). తాళ్లపాలెంలో నేడు నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ (Swarnandhra Swachh Andhra) కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు. స్వచ్ఛ భారత్ కు తాము కట్టుబడి ఉన్నామని అందులో భాగంగానే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకున్నట్టు వివరించారు చంద్రబాబు. ఈ రోజుల్లో ఆరోగ్యమే అన్నింటికంటే ముఖ్యం అని.. అందులో ప్లాస్టిక్ ను తగ్గించడం చాలా ఇంపార్టెంట్ అన్నారు చంద్రబాబు నాయుడు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏపీ రూపురేఖలు మార్చేస్తుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు.
వాడిన ప్లాస్టిక్ ను ఇస్తే డబ్బులు ఇచ్చేలా కార్యక్రమాలు తీసుకొచ్చేందుకు చూస్తున్నాం అని వివరించారు చంద్రబాబు నాయుడు. వ్యర్రథాలను వనరుగా, ఆస్థిగా మార్చుకునే కార్యక్రమాలను కూడా తీసుకొస్తామన్నారు చంద్రబాబు నాయుడు(Chandrababu). ప్రస్తుతం సచివాలయంలో ప్లాస్టిక్ ను వాడట్లేదని.. దీన్నే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు నాయుడు. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించొద్దని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలోనే వాటిని 100కు పెంచే ఆలోచన చేస్తున్నాం. ప్రజలు చెత్తను రోడ్డుపై వేయడం మానుకోవాలి. పట్టణాల్లో లక్షల ఇళ్లలో, గ్రామాల్లో కనీసం 10 లక్షల ఇండ్లలో కంపోస్ట్ తయారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వివరించారు చంద్రబాబు నాయుడు.
Read Also: యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు : డిప్యూటీ సీఎం పవన్
Follow Us On: Instagram


