నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ (NITI Aayog) సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. ఈ మీటింగ్ ను ‘వికసిత్ భారత్ 2047’ సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి అనే ధ్యేయంతో ఏర్పాటు చేశారు. మోడీ అధ్యక్షతన జరుగనున్న 11వ నీతి అయోగ్ సమావేశంలో తెలంగాణ విజన్-2047, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై రేవంత్ రెడ్డి (CM Revanth) వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును వివరించనున్నారు.

సమావేశం ముగిశాక సీఎం (CM Revanth) పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. రాష్ట్రంలోని పెండింగ్​ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలను కలిసి మీనాక్షి నటరాజన్ తిరస్కరణ, మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరుకానున్నారు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, కేంద్ర-రాష్ట్ర సమన్వయంపై చర్చించనున్నారు.

Read Also: బడి లేదు, రోడ్డు లేదు.. మాంగ్లీ గూడెం వాసుల తీరని గోస!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>