హరీష్‌రావుపై ఆరోపణలు: డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్​: క్షుద్ర పూజలు చేశారంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు (Harish Rao)పై బహిరంగంగా నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంపై న్యాయవాది, సామాజికవేత్త కారుపోతుల రేవంత్ ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు.

సదరు ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ కేసు విచారణను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై స్పష్టతనిస్తూ నాలుగు వారాల్లోగా ప్రాథమిక “యాక్షన్ టేకెన్ రిపోర్ట్” (ATR) సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. హరీష్‌రావుపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>