కలం, వెబ్ డెస్క్: జైలులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి చంపాలని చూశారని గుంటూరు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ లేడి కానిస్టేబుల్ చేత ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టించారని, సీసీ కెమెరాల ఫుటేజ్‌ను లోకేష్, పవన్ కళ్యాణ్, డీజీపీకి పంపించారని, వారి వల్ల ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. తాను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే అని, ఇంటర్ చదివే రోజుల్లో పవన్ సినిమా టికెట్లు కొని ఫ్రీగా పంచానని బోరుగడ్డ అన్నారు. పవన్ కళ్యాణ్ బాప్టిజం తీసుకున్నారని, ఆయన క్రిస్టియన్ అని బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు.
తన ఆస్తులను జప్తు చేశారని, బ్యాంక్ అకౌంట్స్ (Bank Accounts) ఫ్రీజ్ చేశారని, చివరకు తనను రోడ్డుపైకి లాగేశారని బోరుగడ్డ అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, మామ ఇంటిపై దాడులు జరిగాయని, లండన్‌లో సెటిల్ అయిన చెల్లెళ్లకు నోటీసులు పంపారని అన్నారు. తల్లి, భార్య, చెల్లికి నొప్పి కలిగించేలా మాట్లాడారు కాబట్టే డిఫెన్స్ చేసుకునేందుకు తాను కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందన్నారు బోరుగడ్డ.
తాను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పిల్లలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే పాయింట్ బ్లాక్‌లోపెట్టి షూట్ చేయండన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఫేస్ చేయడానికి ఆవేశంగా మాట్లాడి తప్పు చేశానని చెప్పారు. తాను ఏ రోజూ చంపేస్తాను, నరికేస్తాను అని అనలేదని, ఎవరికి కావాల్సినట్లు వాళ్లు వీడియోస్ కట్ చేసి మార్ఫింగ్ చేశారని బోరుగడ్డ (Borugadda Anil Kumar) అన్నారు.
Read Also: యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే అంతా సెట్ అవుతారు : డిప్యూటీ సీఎం పవన్
Follow Us On: Youtube


