ఇంధ‌న‌ ధరల పెంపుతో సామాన్యుల‌పై భారం: సీపీఐ నేత‌ పంజాల శ్రీనివాస్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపడానికి పదేపదే వంట గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతోంద‌ని సీపీఐ క‌రీంన‌గ‌ర్ జిల్లా కార్య‌ద‌ర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) విమ‌ర్శించారు. కేంద్రం తీరును నిర‌సిస్తూ ఈ నెల 10వ తేదీన సీపీఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీన్ని విజయవంతం చేయ‌డానికి సీపీఐ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి రావాలని కోరారు. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజల జీవన ప్రమాణలపై ప్రభావం పడుతుందని, పేదల ఆర్థిక స్థితి గతులు చిన్నాభిన్నం అవుతున్నాయని శ్రీనివాస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు సిలిండర్లపై వంట చేసుకునే పరిస్థితి లేకుండా పోతుందని చెప్పారు. చిన్న చిన్న ఉద్యోగాలు, ప్రైవేట్ రంగాల్లో తక్కువ వేతనాలతో కుటుంబాలను పోషించుకునే వారు కనీసం వారి వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకోవడానికే భయపడుతున్నారని అన్నారు. దేశంలో ఇంధ‌న‌ కొరత ఏర్పడదని ప్రగల్భాలు పలికిన బీజేపీ పాలకులు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెంచి సామాన్యులపై పెను భారం మోపార‌న్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఐ ఆధ్వర్యంలో జరిగే ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.

Read Also: తెలంగాణ కేబినెట్‌లో మార్పులు.. కీలక మంత్రులు ఔట్?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>