తాతా మధును కేసీఆర్ ఉసిగొల్పారు : మహేశ్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. స్పీకర్ పై తాతా మధు అనుచిత వ్యాఫ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. స్పీకర్ ను అవమానించడం తాతా మధు ఆలోచన కాదన్నారు. ఆయన్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉసిగొల్పి మాట్లాడించారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిని అవమానించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ కు రాజకీయా పార్టీగా కొనసాగే అర్హత లేదని.. వెంటనే ఆ పార్టీ రద్దు చేయాలని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. దళిత మహిళలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>