epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నేడు ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్​ వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి క్రిస్మస్ వేడుకలు (Christmas celebrations) ఘనంగా జరగనున్నాయి. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొననున్నారు. ప్రభుత్వం ఈ వేడుకలను మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోంది. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) సీనియర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

ఎల్‌బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి. జాన్‌తో సహా క్రైస్తవ మైనార్టీ నాయకులు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి, ఈ వేడుకలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకల (Christmas celebrations) ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నాయకులు వివరించారు. వేడుకల సందర్భంగా ఎల్‌బీ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు ఉంటాయి.

Read Also: నేడు హైద‌రాబాద్‌కు రానున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>