Mobile Popup Ad
Mobile Popup Ad

800 ఏళ్ల ప్రాచీన శివాలయం ధ్వంసం.. కేంద్రం సీరియస్!

కలం, వెబ్‌డెస్క్: వరంగల్ (Warangal) జిల్లాలో 800 ఏళ్ల నాటి చారిత్రక కాకతీయ శివాలయం ధ్వంసంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఖానాపూర్ మండలం అశోక్ నగర్‌లో ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ నిర్మాణం కోసం బుల్డోజర్లతో ఈ పురాతన ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై తెలంగాణకు చెందిన ప్రముఖ హ్యూమన్ రైట్స్ న్యాయవాది ఇమ్మనేని రామారావు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ (NMA) స్వీకరించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించి దీనిపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పురావస్తు శాఖ (ASI) విచారణ ప్రారంభించి, కేసు నమోదు చేశాయి. అయితే 1965లోనే ఈ ఆలయ శాసనాలను హెరిటేజ్ శాఖ అధికారులు నమోదు చేసినట్లు తెలిపాయి. తెలంగాణ హెరిటేజ్ చట్టం సెక్షన్ 30 కింద బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర శాఖ పరిధిలో ఉన్న ఆలయాన్ని సంరక్షించాల్సింది పోయి అభివృద్ధి పేరుతో ధ్వంసం చేయడంపై చరిత్రకారులు, స్థానికులు మండిపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>