Mobile Popup Ad
Mobile Popup Ad

నటి అషురెడ్డికి షాక్‌: సీసీఎస్ నోటీసులు!

కలం, వెబ్‌ డెస్క్‌ : సినీ నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషురెడ్డి (Ashu Reddy) చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. పెళ్లి పేరుతో ఎన్ఆర్ఐ (NRI) ధర్మేంద్రను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ సిసిఎస్ (CCS) పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో అషురెడ్డితో పాటు ఆమె తల్లిదండ్రులకు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు.

లండన్‌లో ఉంటున్న ధర్మేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి సుమారు 10.5 కోట్ల రూపాయలు కాజేశారని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది. కాగా తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) కొట్టివేయాలని, దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పోలీసులు చట్టప్రకారం విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేయడంతో అషురెడ్డి కుటుంబం చిక్కుల్లో పడింది. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించే అవకాశం ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>