Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ జిల్లా కేంద్రంలో రూ. 70 కోట్లతో అభివృద్ధి

కలం, మంచిర్యాల: మంచిర్యాల (Mancherial) జిల్లా కేంద్రంలో అధికారులు రూ. 70 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.  శనివారం శ్రీనివాస టాకీస్‌రోడ్డులో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రూ. 70 కోట్ల వ్యయంతో భూగర్భ మురికికాలువలు, రహదారులు విస్తరణ చేయనున్నారు. ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు రహదారుల సుందరీఖరణ చేస్తానని ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు అన్నిశాఖల అధికారుల సమన్వయంతో పనులు చేపట్టారు. మెయిన్ రోడ్, మార్కెట్ రోడ్డు, వెంకటేశ్వర టాకీస్, ఫారెస్ట్ ఆఫీస్ ఏరియా, రైల్వే స్టేషన్ రోడ్ లలో అభివృద్ధి పనులు జరగనున్నాయి. వర్షాకాలం ఆరంభంలోపు పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులు, క్షంట్రాక్టర్ కు సూచించారు.

వ్యాపారుల అభ్యంతరం

రహదారుల విస్తరణ పై పలువురు వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ఇండ్లకు నష్టం కలిగేలా రోడ్డు వెడల్పు చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు వెడల్పు సైజ్ తగ్గించాలని కోరారు.

Read Also: LPG గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>