సెట్విన్‌ను ఉత్తమ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతా : మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ సెట్విన్‌ను రాష్ట్రంలోనే ఉత్తమ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. శనివారం నల్లగొండలోని సెట్విన్ శిక్షణ కేంద్రంలో సర్టిఫికెట్ల ప్రదానోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. యువత ఉపాధి మార్గాలను ఎంచుకుని స్వయం ఉపాధి వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా ఎదగాలని మహిళలకు సూచించారు. సెట్విన్ శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించాలని పేర్కొన్నారు. నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించడమే సెట్విన్ లక్ష్యమని, నల్గొండలో స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఐటీఐలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, న్యాక్ సెంటర్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. సెట్విన్ కేంద్రంలో అవసరమైన అన్ని సౌకర్యాలు త్వరలోనే కల్పిస్తామని కోమటిరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) హామీనిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>