కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరంలోని ఎల్లంబజార్ (Yellambazar)లో కొలువుదీరిన 51 అడుగుల మహా గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైర్ ఇంజిన్, నీటి ట్యాంకర్ల సహాయంతో ప్రతిష్ఠించిన చోటనే నిమజ్జనం చేయడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఎల్లంబజార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, భక్తుల జయజయధ్వానాల మధ్య మహాగణపతి నిమజ్జనం వైభవంగా జరిగింది.

