Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. బాలుడి ప్రాణం తీసిన చిప్స్ ప్యాకెట్

కలం, వెబ్ డెస్క్ : చిప్స్ ప్యాకెట్ (Chips Packet), చాక్లెట్లు పిల్లలకు చాలా ఇష్టమైన తినుబండారాలు. చిన్న పిల్లల ఏడుపు మానిపించడానికి.. అన్నం తినిపించడానికి సాధారణంగా చిప్స్ ప్యాకెట్స్ ఇస్తుంటారు. తల్లిదండ్రులు కూడా వారి అల్లరిని తట్టుకోలేక చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్స్ కొనిస్తారు. ఇవి ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, చిప్స్ కంపెనీలు మాత్రం పిల్లలను ఆకర్షించడానికి చాలా ఆఫర్స్ తీసుకొస్తున్నాయి.

చిప్స్ ప్యాకెట్లలో మిని క్రియేచర్ బొమ్మలు పెట్టి సేల్స్ పెరిగేలా చేసుకుంటున్నాయి. అయితే, ఈ ప్లాస్టిక్ బొమ్మలు మాత్రం చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా, చిప్స్ ప్యాకెట్ లో వచ్చే బొమ్మ గొంతులో ఇరుక్కుని ఓ బాలుడు మరణించాడు. అనంతపురం జిల్లా గుత్తిలో బాలుడు ఫర్హాన్ (5) చిప్స్ ప్యాకెట్ తింటుండగా అందులోని బొమ్మ గొంతులో ఇరుక్కూపోయింది. దీంతో ఊపిరాడక ఇబ్బంది పడిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>