Mobile Popup Ad
Mobile Popup Ad

మల్లన్న సమక్షంలో 300 మంది టీఆర్పీలో చేరిక

కలం, వెబ్ డెస్క్ : ఉగాది పండుగ రోజు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ తగిలింది. సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లో (Gajwel) తీన్మార్ మల్లన్న సమక్షంలో 300 మంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP)లో చేరారు. చేరిన వారందరికీ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వైపు ప్రజలు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతూ, దాదాపు 300 మంది కార్యకర్తలు, యువకులు, స్థానిక నాయకులు పార్టీలో చేరినట్లు మల్లన్న తెలిపారు. గజ్వేల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.

సంవత్సరాలుగా ఒకే కుటుంబ రాజకీయాలకు విసిగి, ఇప్పుడు నిజమైన ప్రజా పాలన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) వైపు అడుగులు వేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇది కేవలం చేరికలు కాదని.. ఇది ప్రజల తిరుగుబాటు ప్రారంభం అని స్పష్టం చేశారు. చేరికల దృష్ట్యా గజ్వేల్‌లో బీఆర్ఎస్ పట్టు సడలుతోందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలోపేతానికి ఈ చేరికలు కీలక మలుపుగా మారనున్నాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో గజ్వేల్ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని భారీ చేరికలు జరగనున్నాయని వారు పేర్కొన్నారు. ఉగాది రోజే వచ్చిన ఈ స్పందన.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది అని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read Also: సంగారెడ్డిలో పిల్లల కిడ్నాప్ కలకలం

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>