కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ కావాలనో, ప్రియుడిపై అతి ఇష్టమో కానీ.. ఓ ప్రియురాలి చేసిన చర్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన ప్రియుడిపై ప్రేమాభిమానం చాటాలనుకుంది. ఇందుకోసం 3.5 గంటల వ్యవధిలో కారుపై 3,400 ముద్దుల వర్షం కురిపింది. అయితే రోడ్డుపై వెళ్తున్న కారును పోలీసులు గమనించి షాక్ అయ్యారు. నిబంధనల ఉల్లంఘన కింద రూ. 5,500 జరిమానా విధించారు. అంతేకాకుండా ప్రియుడితో స్వయంగా కారుపై ఉన్న ఆ ముద్దుల గుర్తులన్నింటినీ తుడిపించి శుభ్రం చేయించారు. మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రియుడి కారుపై ప్రియురాలు ముద్దుల వర్షం!
-తన ప్రియుడిపై ప్రేమాభిమానం చాటాలనుకుంది ఓ ప్రియురాలు
-ఇందుకోసం 3.5 గంటల వ్యవధిలో కారుపై 3,400 ముద్దుల వర్షం
-రోడ్డుపై వెళ్తున్న కారును పోలీసులు గమనించి, నిబంధనల ఉల్లంఘన కింద రూ. 5,500 జరిమానా
-ఆ యువకుడితోనే స్వయంగా కారుపై ఉన్న ఆ… pic.twitter.com/fe5oAT7CFS— Kalam Daily (@kalamtelugu) August 25, 2026

