నేడు పల్నాడులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి పర్యటన

కలం, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu), కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నారు. నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ స్టేడియంలో నిర్వహించనున్న క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో వీరు పాల్గొననున్నారు. ఈ రుణమేళా కార్యక్రమంలో రూ.3,216 కోట్ల రుణాలను రైతులు, మహిళలు, యువతకు సీఎం, కేంద్రమంత్రి పంపిణీ చేయనున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీలు, బ్యాంక్ ప్రతినిధులు రుణమేళాకు హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం నరసరావుపేటకు చేరుకోని కార్యక్రమానికి హాజరు అవుతారు. రుణమేళా అనంతరం మధ్యాహ్నం ఉండవల్లి చేరుకోనున్నారు. సీఎం, కేంద్రమంత్రి పర్యటన దృష్ట్యా 1500 పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

పల్నాడు జిల్లాకు సీఎం రానుండటంతో ఆ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేస్తోంది. పల్నాడు జిల్లా ప్రజల ఆకాంక్ష వరికపూడిశెల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ ప్రాంతంలో రెండు సార్లు శంకుస్థాపన చేసి.. ప్రాజెక్టును విస్మరించారని మండిపడుతున్నారు. ఈ పర్యటనలోనైనా ప్రాజెక్ట్ పూర్తి చేయడంపై జిల్లా ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాకు పంపిణీ చేయనున్న రుణాల్లో కౌలు రైతులకు సాయం అందటం లేదని.. దీనిపై కూడా కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>