Mobile Popup Ad
Mobile Popup Ad

మణుగూరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు (Manuguru) పట్టణంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. బొగ్గు గనులను లారీల్లో లోడింగ్ చేసే ప్రాంతం కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (CHP – Coal Handling Plant)లో మృతదేహం లభించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతుడు విఠల్‌రావు నగర్‌కు చెందిన రమేష్‌గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది హత్యా లేక ఆత్మహత్యా అని తేల్చడానికి అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>