రైల్వే స్టేషన్లు రెడీ..నేడు ప్రారంభించనున్న మోదీ!

కలం, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో రైల్వే మౌలిక వసతుల కల్పనలో భాగంగా నేడు రెండు కీలక రైల్వే స్టేషన్లు సరికొత్త రూపురేఖలతో అందుబాటులోకి రానున్నాయి. విజయవాడకు ప్రత్యామ్నాయంగా, శాటిలైట్ స్టేషన్‌గా అభివృద్ధి చేసిన రాయనపాడు రైల్వేస్టేషన్‌ (Rayanapadu Railway Station)తో పాటు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ (HITEC City Railway Station)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

విజయవాడ సమీపంలోని రాయనపాడు రైల్వేస్టేషన్‌ను సుమారు రూ.35 కోట్ల నిధులతో అత్యాధునికంగా అభివృద్ధి చేశారు. మెట్రో నగరాల తరహాలో ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలను ఇక్కడ కల్పించారు. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్‌పై రద్దీని తగ్గించేందుకు ఈ శాటిలైట్ స్టేషన్ ఎంతో దోహదపడనుంది. త్వరలోనే రాయనపాడు స్టేషన్ మీదుగా మరిన్ని రైళ్ల రాకపోకలు సాగించేలా రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

మరోవైపు, ఐటీ కారిడార్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. ఈ రెండు స్టేషన్లు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>