Mobile Popup Ad
Mobile Popup Ad

ఆర్చరీలో ప్రతిభ చాటుతున్న ఇందూరు స్టూడెంట్

కలం, నిజామాబాద్ బ్యూరో : శ్రీనిక విల్లు ఎక్కు పెడితే.. పతకాలు తల వంచాల్సిందే.. సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా నిజామాబాద్ జిల్లా స్థాయిలో ఆర్చరీ పోటీల్లో పదో తరగతి విద్యార్థిని మద్దుల శ్రీనిక (Srinika) ప్రతిభతో అబ్బుర పరిచింది. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది.. జిల్లా స్థాయిలో బాలికల కాంపౌండ్ విభాగంలో ట్యాలెంట్​ తో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 15 ఏళ్ల శ్రీనిక ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఈ నెల 19వ తేదీ నుండి 21 వరకు ఖమ్మంలో జరగనున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అర్చరీ కోచ్ డాక్టర్ రవిశంకర్ శ్రీనికను అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>