108 అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం!

కలం, మామడ :  అత్యవసర సమయంలో 108 అంబులెన్సు (108 Ambulance) సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేశారు. అంబులెన్సులోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన అమీనా బేగంకు పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే గ్రామానికి చేరుకున్న అంబులెన్సు సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా, నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ సమీపంలో నొప్పులు తీవ్రం కావడంతో వాహనాన్ని నిలిపివేశారు. అంబులెన్సులో విధులు నిర్వహిస్తున్న ఈఎంటీ సురేష్, పైలట్ జ్ఞానేశ్వర్ సమయస్ఫూర్తితో స్పందించి ఆమెకు సురక్షితంగా ప్రసవం చేశారు. అమీనా బేగం మూడవ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>