కలం, వెబ్ డెస్క్: తన కూతురి వివాహానికి, రాజకీయాలకు లింకులు పెట్టి.. తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) హెచ్చరించారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ వైఎస్ఆర్ బిడ్డగా తనకు లేదని పేర్కొన్నారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు సోషల్ మీడియాలో తనపై అల్లుతున్నవి కట్టుకథలు అని స్పష్టం చేశారు. అవన్నీ నిరాధార ఆరోపణలని.. ఆ ప్రచారం శుద్ధ అబద్ధం అని కొట్టిపారేశారు. తానంటే గిట్టని వాళ్ళే పస లేని ఆరోపణలు చేస్తున్నారని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా కలిసింది తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనేనని మరోసారి షర్మిల స్పష్టం చేశారు. మళ్లీ ఇప్పుడు కలిసినా.. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి రావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఇందులో కొత్తేమీ లేదని.. వింత అంతకన్నా కాదని పేర్కొన్నారు. తన బిడ్డ వైఎస్ అంజిలి (YS Anjili Reddy) – సోమల రఘురామ్ వివాహ మహోత్సవానికి తెలుగు ప్రజలందరూ హృదయ పూర్వక ఆశీస్సులు అందించాలని షర్మిల (YS Sharmila) కోరారు.
Also Read : రాప్తాడులో పరిటాల రవి, NTR విగ్రహావిష్కరణ.. జగన్‌కు లోకేష్ ‘మాస్ ఛాలెంజ్’!
Follow Us On: X(Twitter)

