సీఎం చంద్రబాబుతో షర్మిల భేటీ.. కారణమిదే!

‎కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన కుమార్తె అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డి వివాహానికి రావాలంటూ పెళ్లి పత్రికను అందించారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల.. సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. గతంలో తన కుమారుడి పెళ్లి సందర్భంగా కూడా సీఎంను షర్మిల కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా షర్మిల తన కుమార్తె పెళ్లికి అన్ని రాజకీయ పార్టీల వారిని ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>