కలం, వెబ్ డెస్క్: స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) చంద్రబాబు గెలిచినా.. నైతికంగా ఓడిపోయారని వైసీపీ అధినేత జగన్ (YS Jagan) స్పష్టం చేశారు. అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ, ప్రజల విశ్వాసాన్ని మాత్రం గెలవలేరని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘స్థానిక ఎన్నికల్లో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేశారో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీ చేస్తున్నారు’ అని విమర్శించారు.
ఎన్ని దాడులు జరిగినా..
ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు, దాడులు జరిగినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళా నేతలు పోరాడారని వైఎస్ జగన్ (YS Jagan) ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిగా మరింత పోరాడుదామని పిలుపునిచ్చారు. తాము ఓడిపోయినా ప్రజల మనసులను గెల్చుకున్నట్లు స్పష్టం చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులతో పాటు ప్రజాస్వామ్యం, మెరుగైన ఏపీ భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. తమ స్ఫూర్తి ఎప్పటికీ చెదిరిపోదన్నారు. ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుందని జగన్ పేర్కొన్నారు.
Also Read : వైసీపీకి భారీ షాక్.. బొత్స అనూష ఓటమి
Follow Us On: X(Twitter)

