Mobile Popup Ad
Mobile Popup Ad

అమరావతి vs మావిగన్.. జగన్ కొత్త రాజకీయ స్లోగన్

కలం, వెబ్ డెస్క్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికలకు తమ పార్టీ “మావిగన్” (MAVIGUN) నినాదంతో ప్రజలలోకి వెళ్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, “మావిగన్ కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ఓటు వేయండి. అమరావతి (Amaravati) కావాలంటే చంద్రబాబుకి(Chandrababu) ఓటు వేయండి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర చర్చకు దారితీశాయి. అమరావతి అభివృద్ధి అంశం ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రధాన రాజకీయ చర్చగా మారిన నేపథ్యంలో జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కూటమి నేతల మధ్య అభివృద్ధి నమూనాలపై కొనసాగుతున్న రాజకీయ పోరులో ఈ వ్యాఖ్యలు కొత్త చర్చను రేకెత్తించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>