Mobile Popup Ad
Mobile Popup Ad

పవన్ ఆదేశాలు.. నదుల కాలుష్య నివారణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నదుల కాలుష్య నివారణకు అత్యున్నత స్థాయి ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. నదుల్లోని కాలుష్య సమస్యలను గుర్తించి, వాటి నివారణకు తక్షణ చర్యలు చేపట్టడం కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది జూన్ నెలలో మొదలయ్యే గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నేపథ్యంలో గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదులలో కాలుష్య నివారణే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశాలు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పవన్ కల్యాణ్ అధ్యక్షతన రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. పవన్ ఆదేశాల మేరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు (Special Task Force) చేస్తూ పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు.

ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు..

ఇటీవల రెండు రోజులపాటు రాజమండ్రిలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్వయంగా పడవపై ప్రయాణించి నల్లా ఛానల్, ఆంధ్ర పేపర్ మిల్స్ పరిశ్రమల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ పరిశ్రమల నుంచి వస్తున్న రసాయన వ్యర్థాలు, నగర మురుగునీరు నేరుగా పవిత్రమైన గోదావరి నదిలో కలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు స్వచ్ఛమైన గోదావరి జలాల్లో స్నానం చేస్తున్నామనే ఆధ్యాత్మిక అనుభూతి కలగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ నదిలోకి కలిసే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను అరికట్టడంతోపాటు, శాశ్వత పర్యావరణ రక్షణ చర్యలను అనుక్షణం పర్యవేక్షిస్తుంది.

కమిటీ చైర్మన్, సభ్యులు ఎవరంటే..

ఈ నూతన కమిటీకి చైర్మన్‌గా పర్యావరణ, అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వ్యవహరించనున్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. పురపాలక పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ), పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనర్, వ్యవసాయ శాఖ కమిషనర్, మత్స్య శాఖ కమిషనర్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈఓ, దేవాదాయ శాఖ కమిషనర్, జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్, గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్-ఇన్-చీఫ్, క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ మిషన్ డైరెక్టర్, గోదావరి పరివాహక ప్రాంత జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, పోలవరం జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశం అవుతుంది. గోదావరితోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నదుల్లోకి కాలుష్యం ఎక్కడెక్కడ నుంచి చేరుతుందో క్షేత్రస్థాయిలో గుర్తించి నివారణ చర్యలను తీసుకుంటుంది.

Read Also: ‘మావిగన్’ మాట వింటే చంద్రబాబుకు బీపీ పెరిగిపోతుంది: జగన్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>