వెల్గటూర్‌లో విషాదం.. యువకుడు ఆత్మహత్య

కలం, కరీంనగర్ బ్యూరో: ​భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. భార్య పుట్టింటికి వెళ్ళిందనే మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ (Velgatoor) మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ​వెల్గటూర్ మండలం ముక్కట్రావు పేట గ్రామానికి చెందిన మేకల గణేష్ (25) అనే యువకుడికి, అతని భార్యకు మధ్య కొంతకాలంగా కలహాలు నడుస్తున్నాయి. ఉపాధి కోసం ఈ దంపతులిద్దరూ కలిసి ఇటీవల హైదరాబాద్ వెళ్లారు. అక్కడ సరైన పని దొరక్కపోవడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు.

​ఈ క్రమంలోనే నిన్న రాత్రి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య, ఈరోజు ఉదయాన్నే తన పుట్టింటికి వెళ్ళిపోయింది. భార్య వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన గణేష్.. తీవ్రమైన బాధతో మద్యం సేవించాడు. అనంతరం అదే మైకంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న వెల్గటూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>