కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: ‘సర్’ ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి హరిప్రియ ఆదేశించారు. జడ్చర్ల (Jadcherla) మండలం కొత్త తండాలో పోలింగ్ స్టేషన్‌లో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించారు.
ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, స్వీకరణ ప్రక్రియ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ తనిఖీలో జడ్చర్ల ఏఈఆర్‌ఓ తహసీల్దార్ నర్సింగరావు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్ సర్పంచి, బూత్ లెవల్ అధికారి పాల్గొన్నారు.

