ఊటీలో ముందుగానే మంచు అందాలు.. 5.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత!

కలం, నేషనల్ డెస్క్ : తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీని (Ooty) చలి తీవ్రత వణికిస్తోంది. నీలగిరి (Nilgiris) జిల్లాలోని ఊటీ, పరిసర ప్రాంతాలు తెల్లవారుజామున మంచు దుప్పటి కప్పుకున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 5.9 డిగ్రీల సెల్సియస్‌కు (Temperature Drops to 5.9°C) పడిపోవడంతో ఆ ప్రాంతమంతా చల్లని వాతావరణం నెలకొంది. అయితే సాధారణంగా డిసెంబర్ 15 తర్వాత ప్రారంభమయ్యే మంచు సీజన్ ఈ ఏడాది ముందుగానే మొదలుకావడం విశేషం. ఇక ఉదయం వేళల్లో గడ్డి మైదానాలు, చెట్లు, మొక్కలు, రహదారుల పక్కన నిలిపిన వాహనాలపై తెల్లటి మంచు పొరలు కనిపించాయి. ప్రకృతి అందాలకు పేరుగాంచిన ఊటీ మంచు అందాలతో మరింత ఆకర్షణీయంగా మారింది.

తెల్లవారుజామున బయటకు వచ్చిన స్థానికులు, పర్యాటకులు ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో ప్రజలు చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు, స్వెటర్లు, జాకెట్లు ధరించాల్సి వస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో సాధారణ జనజీవనంపై ప్రభావం కనిపిస్తోంది. ఈసారి సాధారణ సమయం కంటే ముందుగానే మంచు సీజన్ ప్రారంభం కావడంతో ఊటీ పర్యాటక ప్రాంతాల్లో ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>