కూచిపూడి నృత్యంతో అలరించిన చిన్నారి సహస్ర.. నంది అవార్డు సొంతం

కలం, సోన్‌: చిన్న వయసులోనే కూచిపూడి నృత్యంలో ప్రతిభ చాటుతూ కడ్తాల్‌ గ్రామానికి చెందిన చిన్నారి సహస్ర మామిళ్ళ (Sahasra Mamilla) నంది అవార్డును అందుకుంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌‌లోని రవీంద్ర భారతిలో సిరిఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సహస్ర తన కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఆమె నృత్య ప్రతిభకు నిర్వాహకులు నాట్య మంజరి ప్రశంసాపత్రంతో పాటు నంది అవార్డును అందజేశారు.

సోన్‌ మండలం కడ్తాల్‌ గ్రామానికి చెందిన మామిళ్ళ లింగయ్య, ఉమాదేవి దంపతుల కుమార్తె సహస్ర ప్రస్తుతం గ్రామంలోని వేదిక్‌ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. నాలుగేళ్ల వయసు నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమె అప్పటి నుంచి సాధన చేస్తూ పలు సాంస్కృతిక వేదికలపై ప్రదర్శనలు ఇస్తోంది. చిన్న వయసులోనే తన ప్రతిభతో అవార్డు అందుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>