కలం, స్పోర్ట్స్: బ్యాట్‌తో పరుగుల వరద పారించే యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇప్పుడు గ్లవ్స్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీకి ముందు కొత్త స్కిల్‌పై ఫోకస్ పెట్టాడు. ముంబై ప్రాక్టీస్ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ చేశాడు. సుమారు 10 ఓవర్లు వికెట్ల వెనుక నిలిచాడు. కీపింగ్ గ్లవ్స్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నాడు. జైస్వాల్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని ముంబై కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ కూడా ధ్రువీకరించాడు. బ్యాటింగ్ తన ప్రధాన బలం అని, దానికి మరో స్కిల్‌ను జోడించాలనే ఉద్దేశంతో జైస్వాల్ కీపింగ్ నేర్చుకుంటున్నట్లు లాడ్ తెలిపాడు. భవిష్యత్తులో ముంబై తరఫున కానీ, భారత జట్టు తరఫున కానీ కీపింగ్ చేసే అవకాశం కోసం జైస్వాల్ ప్రయత్నిస్తున్నట్లు తనకు తెలిసిందని లాడ్ చెప్పాడు.
అయితే అతడి పూర్తి ప్రణాళికపై తనకు స్పష్టత లేదని కూడా పేర్కొన్నాడు. జైస్వాల్‌కు కీపింగ్ కొత్త విషయం కాదు. ఇప్పటికే లెగ్స్పిన్పై కూడా అతను పనిచేస్తున్నాడు. ఇప్పుడు కీపింగ్‌ను కూడా తన ఆటలో మరో భాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అక్టోబర్ 11న వాంఖడేలో చండీగఢ్‌తో జరిగే ముంబై తొలి రంజీ మ్యాచ్‌కు జైస్వాల్ అందుబాటులో ఉంటాడు. ఆ తర్వాత జాతీయ జట్టు బాధ్యతలతో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.

