‘తులాభారం’ ఫస్ట్ డే షూట్‌లో ర‌వితేజ‌!

క‌లం, సినిమా: మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబినేషన్‌లో వ‌స్తున్న‌ మోస్ట్ ఎవైటెడ్ మూవీ తులాభారం (Thulabharam). క్రైమ్, డ్రామా, ఎంటర్‌టైన్‌మెంట్‌తో సరికొత్త అనుభూతి క‌లిగించేలా ఈ సినిమా రూపొందిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’ విజయంతో జోరు మీదున్న రవితేజ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌తో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తునారు. తులాభారం ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

రవితేజ తనదైన ఎనర్జీ, పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ‘మాస్ మహారాజా’గా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అయితే ‘తులాభారం’తో ఆయన సరికొత్త ఐడెంటిటీని సొంతం చేసుకోబోతున్నారు. ఇందులో ‘మాస్ మహారాజా’కు బదులుగా ‘క్రైమ్ మహారాజా’గా పరిచయం అవుతున్నారు. ‘నవ రవితేజం’గా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాలను పెంచింది. తులాభారం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైయింది. బుధ‌వారం హీరో రవితేజ తన ఫస్ట్ డే షూట్ లో జాయిన్ అయ్యారు. ఆయనతోపాటు కీలక నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్, ప్రియాంక మోహన్, అనస్వర రాజన్, జేడీ చక్రవర్తి, అనిల్ కరెళ్ల, రవి ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>