యాదాద్రిలో ఊంజల్‌ సేవ మహోత్సవం

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాలమ్మ ఊంజల్ సేవా ఉత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామునే సుప్రభాతంతో స్వామి వారికి పూజలు చేశారు. నిత్య పూజలతోపాటు సంప్రదాయ పర్వాలు నిర్వహించారు. గర్భాలయంలో స్వయంభూలను పూజించి.. బాలాలయంలో ఆర్జిత పూజలను చేపట్టారు. ఉత్సవ మూర్తులకు పాలాభిషేకం చేసి దర్శన మూర్తులకు స్వర్ణ పుష్పాలతో అర్పించారు.

సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది ఊంజల్ సేవా ఉత్సవాన్ని చేపట్టారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి, గంట పాటు వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని ఆరాధిస్తూ పూజారులు హారతి సమర్పించారు. అంతకు ముందు అమ్మవారి సేవను బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు. భక్తులు, మహిళలు పాల్గొని ప్రత్యేక మంగళ హారతులతో అమ్మవారికి పూజలు చేశారు. ఏఈవో దొమ్మాట సురేందర్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>