కలం, వెబ్ డెస్క్ : ఇండియాలో ‘X‘ సేవలకు మరోసారి అంతరాయం ఏర్పడింది. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఎక్స్ (X Down) ఖాతాలు పనిచేయలేదు. టైమ్ లైన్లు ఖాళీగా కనిపించడంతో పాటు కొత్త పోస్టులు కూడా అప్ లోడ్ కాకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది రిపోర్టు చేశారు. వారంలో రెండోసారి ఎక్స్ సేవలు ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయాయి. దీనిపై ఇప్పటి వరకు ఎక్స్ సంస్థ ప్రతినిధులు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
ఇటీవల ఎక్స్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. గ్రోక్ (Grok) లో అసభ్యకర వీడియోలు, న్యూడ్ ఫొటోలు, చట్ట విరుద్ధమైన ఏఐ ఆధారిత కంటెంట్ పై భారత ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై ఎక్స్ క్షమాపణలు కూడా చెప్పింది. తమ వైపు నుంచే తప్పు ఉన్నట్టు ఒప్పుకుని 600 అకౌంట్లను డిలీట్ చేసింది. 3500 అసభ్యకర పోస్టులను బ్లాక్ లో పెట్టింది. యూజర్ పాలసీని మరింత కఠినతరం చేస్తున్నామని.. మరిన్ని కఠినమైన రూల్స్ అమలు చేస్తామని ఎక్స్ తెలిపింది. న్యూడిటీని కంట్రోల్ చేస్తామని.. మహిళల హక్కులకు భంగం రానివ్వబోమని ఎక్స్ చెప్పింది. ప్రస్తుతం ఇలా అంతరాయం (X Down) వెనకాల అదే కారణమై ఉండొచ్చని.. కొత్తగా ఏమైనా అప్డేట్లు చేస్తున్నారేమో అంటూ సోషల్ మీడియా నెటిజన్లు అనుకుంటున్నారు.
Read Also: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా వర్సిటీలు వెలవెల
Follow Us On: Youtube


