Mobile Popup Ad
Mobile Popup Ad

రోడ్డు దాటుతుండగా క్రేన్ ఢీకొని యువతికి తీవ్ర గాయాలు

కలం, కరీంనగర్ బ్యూరో: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ యువతిపైకి దూసుకెళ్లిన ఘటన ​కరీంనగర్‌ (Karimnagar) జిల్లాలో చోటుచేసుకుంది. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద ఓ యువతి ప్రమాదానికి గురైంది. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన క్రేన్ ఆమెపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం కుక్కల గూడూరుకు చెందిన యువతి బ్యూటీషియన్ కోర్స్ కోసం తరచూ కరీంనగర్‌కు అప్ అండ్ డౌన్ చేస్తుంది. ఈ క్రమంలో కరీంనగర్ లో బస్సు దిగిన యువతిపై జెసీపీ క్రేన్ దూసుకెళ్లి ఎడమ కాలు పూర్తిగా విరిగింది. ​సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సృజన్ రెడ్డి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రురాలిని వెంటనే తన పోలీస్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>