ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

కలం, వెబ్ డెస్క్: ఏపీలో 2,721 పోస్టులతో డీఎస్సీ (AP DSC) నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 11వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 5న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ జరగనుంది. డిసెంబర్ 14 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టుల్లో 2,111 రెగ్యులర్ స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులున్నాయి. అలాగే 350 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయ పోస్టులు, 150 ప్రత్యేక విద్యా స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. ఈ మేరకు ప్రతి జిల్లాలో పోస్టులు, రిజర్వేషన్లు, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలతో నోటిఫికేషన్ విడుదలైంది. చివరి పరీక్ష పూర్తయిన రెండు రోజుల తరువాత ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>