epaper
Sunday, February 22, 2026
epaper

భర్త అతడి ప్రియుడితో భార్యకు ముప్పు.. ధర్మవరంలో విచిత్ర ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్:  శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరం (Dharmavaram) పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో విచిత్ర కేసు నమోదైంది. తన భర్త అతడి ప్రియుడితో తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకం రేపింది. ధర్మవరం ప్రాంతానికి చెందిన తులసి అనే మహిళకు కొన్నేండ్ల క్రితం దాశరథితో వివాహమైంది. అయితే ఇటీవల భర్త దాశరథి ప్రవర్తన విచిత్రంగా ఉందని తులసి ఆరోపిస్తున్నారు. తన భర్త మన్సూరుద్దీన్ అనే వ్యక్తి తో కలిసి ఉంటున్నాడని.. అతడిని ఇంటికి తీసుకొచ్చి ఇద్దరు సన్నిహితంగా ఉంటున్నారని తులసి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

భర్త దాశరథి మన్సూరుద్దీన్ మధ్య అనైతిక సంబంధం కొనసాగుతోందన్నారు.  ఇద్దరూ ఇంటి బెడ్‌రూమ్‌లో సన్నిహితంగా ఉన్నట్లు స్వయంగా చూశానని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ ఘటన తర్వాత కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ విషయం గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇద్దరూ తనను బెదిరిస్తున్నారని తులసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తనకు రక్షణ కల్పించాలని, భర్త అతని స్నేహితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల నిజానిజాలను నిర్ధారించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

Read Also: అద్దె కట్టలేదని బడికి తాళం.. రోడ్డెక్కిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>