వన్యప్రాణుల వేటగాడు షోయబ్ అఫ్జల్ అరెస్ట్

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) పట్టణంలోని పంజేశా కాలనీలో ప్లంబర్‌గా పని చేస్తూ జల్సా జీవితానికి అలవాటు పడి అడవి జంతువులను వేటాడి (Wildlife Hunter) కొమ్ములు మాంసం విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు సోమవారం ఆదిలాబాద్ పట్టణ వ‌న్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. షోయబ్ గత కొంతకాలంగా హైదరాబాద్ చెందిన ఆరుగురు తో కలిసి వన్యప్రాణులను వేటాడి హతమార్చే వాడ‌ని తెలిపారు.

తమకు అందిన సమాచారం మేరకు షోయబ్ ఇంట్లో సోదాలు చేసి ఓ డబుల్ బ్యారల్ తుపాకీ తోపాటు బుల్లెట్లు, కత్తులు, ఉలి, టార్చ్ లైట్లు, నల్లటి జాకెట్స్, జింకల కొమ్ములు, పుర్రెలు, ఇతర భాగాలు స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ముఠా మహారాష్ట్రలోని ఘాటంజీ అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడి హతమార్చే వారని, తుపాకీతో వేటాడిన అనంతరం వన్యప్రాణుల మాంసం, కొమ్ములు, ఇతర భాగాలను హైదరాబాద్‌లో విక్రయించేవారని చెప్పారు. నిందితుడు ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్ సీజ్ చేసినట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>