ఛత్తీస్‌గఢ్‌లో భార్యపై భర్త క్రూరత్వం.. పిల్లల ముందే అమానుషం!

కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) ఖోరియా జిల్లాలో భార్యపై భర్త అమానుషంగా దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. తార అనే మహిళ 15 ఏళ్ల క్రితం జితేంద్ర ఘసియాను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. భర్త వేధింపులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె పిల్లలతో కలిసి విడిగా ఉంటోంది. ఈ క్రమంలో జూన్ 14న ఆమె ఉంటున్న ప్రాంతానికి వచ్చిన జితేంద్ర, ఆమెపై వివాహేతర సంబంధాల నెపంతో దాడికి పాల్పడ్డాడు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి, గుండు కొట్టాడు. ముఖానికి ఇంజిన్ ఆయిల్ రాసి క్రూరంగా కొట్టాడు. నలుగురు పిల్లల ముందే ఆమెకు బలవంతంగా యూరిన్ తాగించి, తల్లిని కొట్టాలని పిల్లలపై ఒత్తిడి తెచ్చాడు.

ఈ ఘోరానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా (Viral) మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కొరియా పోలీసులు గృహహింస, దాడి, క్రిమినల్ బెదిరింపుల వంటి పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని త్వరలోనే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>