Mobile Popup Ad
Mobile Popup Ad

ఇన్సూరెన్స్ సొమ్ము కోసం దారుణం.. భర్త ప్రాణం తీసిన భార్య!

కలం, వెబ్​ డెస్క్​ : ఖమ్మం (Khammam) పట్టణం గాంధీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న భర్తను అడ్డుతొలగించుకుని, భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ సొమ్మును కాజేయాలని పథకం పన్నిన ఒక భార్య, చివరకు పోలీసులకు చిక్కింది.

వివరాల్లోకి వెళితే.. చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆటో డ్రైవర్ అయిన రవి, మద్యానికి బానిస కావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. తన భర్త త్వరలోనే మరణించే అవకాశం ఉందని భావించిన ప్రశాంతి, అతడి పేరు మీద గత జూలై నెలలో ఏకంగా 66 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేయించింది. అయితే తొమ్మిది నెలలు గడిచినా అతను మరణించకపోవడంతో కఠిన నిర్ణయం తీసుకున్నది.

ఈ క్రమంలోనే తన తమ్ముడు శ్రీనివాస్ సహాయంతో ఈ నెల 2వ తేదీన ఒక పథకాన్ని అమలు చేసింది. ముందుగా రవికి అతిగా మద్యం తాగించి, అనంతరం శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించింది. ఈ ఘటనలో రవి అక్కడికక్కడే మృతి చెందాడు.

మొదట దీనిని రోడ్డు ప్రమాదంగా అందరూ భావించినప్పటికీ, ప్రశాంతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. పోలీసుల శైలిలో విచారించగా, ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే తన తమ్ముడితో కలిసి భర్తను చంపించినట్లు ఆమె నేరాన్ని అంగీకరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>