కారు స్టీరింగ్ పట్టి సందడి చేసిన కవిత.. సోషల్ మీడియాలో హల్‌చల్!

కలం, నిజామాబాద్ బ్యూరో: టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) నిజామాబాద్ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉండే కవిత ఈసారి కారు స్టీరింగ్ పట్టి కొద్దిసేపు డ్రైవింగ్ (Car Driving) చేస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సోమవారం నిజామాబాద్‌లో పర్యటించిన కవిత.. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి రావును పరామర్శించారు.

ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రికి వెళ్లిన కవిత అవంతి రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సమయంలో ఓ వ్యక్తి తన కొత్త కారును నడపాలని కవితను కోరారు. దీంతో ఆమె సరదాగా డ్రైవింగ్ సీటులో కూర్చొని స్టీరింగ్ చేతబట్టారు. కొద్దిసేపు కారు నడుపుతూ అక్కడున్న వారిలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కవిత చిరునవ్వుతో సందడి చేయగా, అక్కడి వారు ఆ దృశ్యాలను తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>