Mobile Popup Ad
Mobile Popup Ad

ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

కలం వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) పోలీస్ శాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్ఐ లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ (Sunpreet Singh) బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవికుమార్, ప్రస్తుతం సీఎఆర్ విభాగంలో ఉన్న ప్రవీణ్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. వీరిద్దరిపై వచ్చిన ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపారు. ఈ విచారణలో వారిపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇరువురు ఎస్ఐలను సస్పెండ్ చేసినట్లు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. ఇటీవల పలువురు ఎస్ఐలు వరుసగా సస్పెన్షన్‌లకు గురికావడంతో పోలీస్ అధికార వర్గాల్లో ఆందోళన నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>