కలం, వనపర్తి: జీవో నంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, విద్యా భవిష్యత్తుపై ఉన్న అనుమానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలను నిలిపివేయాలని కోరుతూ వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు గురువారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యార్థులు తమ సమస్యలను వివరించారు.
జీవో నంబర్ 97తో విద్యా భవిష్యత్తుపై ఏర్పడుతున్న సందేహాలు, శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలతో పాటు పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలపై తమ ఆందోళనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే.. జీవో నంబర్ 97, శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం దృష్టికి అంశాన్ని తీసుకెళ్తానని స్పష్టం చేశారు.

