మీ సేవ కేంద్రాలతో వేగంగా ధ్రువపత్రాలు: అదనపు కలెక్టర్

కలం, వనపర్తి: మీ సేవా కేంద్రాలతో ప్రజలకు అవసరమైన ధ్రువపత్రాలను పారదర్శకంగా, వేగంగా, నిబంధనల మేరకు అందించాలని వనపర్తి (Wanaparthy)  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్ సూచించారు. గురువారం మీ సేవా కేంద్రాల నిర్వాహకులతో జిల్లా స్థాయి సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వైకల్య గుర్తింపు కార్డులు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం, కార్మిక శాఖ సేవలపై శిక్షణ ఇచ్చారు.

ఆన్‌లైన్ విధానం, సేవల ప్రాసెసింగ్ తదితర అంశాలను వివరించారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుము కంటే అదనంగా ఎలాంటి మొత్తాన్ని వసూలు చేయరాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. రుసుములను కేంద్రాల్లో స్పష్టంగా ప్రదర్శించాలని, ప్రతి లావాదేవీకి తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని ఆదేశించారు. మీ సేవ జిల్లా మేనేజర్ వెంకటేష్, టెక్నికల్ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>