సీనియర్ జర్నలిస్ట్ మూర్తి సస్పెండ్

కలం, వెబ్ డెస్క్: ప్రముఖ జర్నలిస్ట్ వీఎస్ఎన్ మూర్తి (VSN Murthy) ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌లో ఆయన పెట్టే పోస్టులు, ఇంటర్వ్యూలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఇటీవల తోటి జర్నలిస్టుల మీద కూడా ఆయన వివాదాస్పద పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రకటించింది. సహచర జర్నలిస్టులను ట్విట్టర్ (ప్రస్తుతం ఎక్స్) వేదికగా పదేపదే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని.. ఎన్ని సార్లు మందలించిన ఆయన ప్రవర్తనలో మార్పు రావడం లేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం వర్గాలు తెలిపాయి.

ఈ సస్పెన్షన్ కాలంలో ఆయనకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, ప్రెస్ మీట్లకు ఆహ్వానించకూడదని పీఆర్‌వోలకు సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయం జర్నలిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది. సంఘం నిర్ణయంపై వీఎస్‌ఎన్ మూర్తి స్పందన తెలియాల్సి ఉంది.

Read Also: ఆ యాంగిల్స్‌లో ఫొటోలు తీయకండి.. కాంతార నటి వార్నింగ్

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>