Mobile Popup Ad
Mobile Popup Ad

ట్రంప్ వెళ్లగానే పుతిన్ ఎంట్రీ: చైనాలో ఏం జరగబోతోంది?

కలం, వెబ్‌ డెస్క్‌ : చైనా రాజధాని బీజింగ్ వేదికగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం చైనా చేరుకున్నారు. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్ వద్ద ఆయనకు చైనా ప్రభుత్వం సైనిక వందనంతో కూడిన అధికారిక స్వాగతం పలికింది.

పుతిన్ ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని వెళ్లిన కొద్ది రోజుల్లోనే పుతిన్ ఇక్కడకు రావడం గమనార్హం. రష్యా చైనా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పుతిన్ ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు. మారుతున్న ప్రపంచ రాజకీయ సమీకరణాలు, వాణిజ్య బంధాలు, భద్రతా పరమైన అంశాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న ఈ ఇద్దరు అగ్రనేతల సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>