రూ. 15 వేలు లంచం.. ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ AE

కలం, వెబ్ డెస్క్: లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) వలకు చిక్కాడు ఓ ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారి. వివరాల్లోకి వెళితే.. విజయనగరం (Vizianagaram) జిల్లా చీపురుపల్లిలో కోళ్ల ఫారం ఏర్పాటు అనుమతుల కోసం లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖకు చెందిన అసిస్టెంట్ ఇంజనీర్ (AE) మహేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మహేష్ చీపురుపల్లి ఇంచార్జ్ స్పెషల్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జిల్లాకు చెందిన రైతుల మీసాల ప్రశాంత్ అనే వ్యక్తి తన కోళ్ల ఫామ్ ఏర్పాటుకు అవసరమైన అనుమతుల కోసం మహేష్‌ను కలిశారు. అయితే అనుమతి ఇచ్చేందుకు మహేష్ రూ. 15 వేలు లంచం డిమాండ్ చేసినట్లు రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పథకం ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మహేష్ పై నిఘా పెట్టారు.

విజయనగరం ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద రైతు నుంచి రూ. 15 వేలు నగదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>