ఈఈ భూక్యా భీంరావుకు ఘన సన్మానం

కలం, నిర్మల్: ఆదిలాబాద్ జిల్లా పంచాయతీరాజ్ శాఖలో డీఈగా పనిచేసి ఈఈగా పదోన్నతి పొందిన భూక్యా భీంరావు (Bhukya Bheemrao)ను నిర్మల్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. వ్యాయామ ఉపాధ్యాయులకు పలు విషయాల్లో సేవలందిస్తూ, మార్గదర్శనం చేసినందుకు కృతజ్ఞతగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీజీపీఈటీ అధ్యక్షుడు సత్తయ్య, కార్యదర్శి వన్నెల భూమన్న, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి రాథోడ్ లక్ష్మణ్, టీఆర్‌టీఎఫ్ కార్యదర్శి దర్శనం దేవేందర్, గౌరవాధ్యక్షుడు భోజన్న, సలహాదారు సుదర్శన్, భూక్యా రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>