Mobile Popup Ad
Mobile Popup Ad

విషాదం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరొకరు మృతి

కలం, వెబ్ డెస్క్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ( Vizag Steel Plant Accident) లో జరిగిన ఘోర ప్రమాదంలో మరో కార్మికుడు చనిపోయారు. విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు శనివారం మృతి చెందాడు. ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య మొత్తంగా 10కి చేరింది.

ఈ నెల 8న సాయంత్రం విశాఖ ప్లాంట్‌లో ఉక్కు ద్రవం కార్మికులపై పడటంతో ఆ రోజే 8 మంది మృతి చెందారు. అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన కార్మికుడు పైడి రాజు రాజు మృతి చెందగా.. తాజాగా కాంట్రాక్ట్ కార్మికుడు సూరిబాబు మరణించారు. దీంతో సూరిబాబు కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇప్పటికే చనిపోయిన 9 మంది మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పరిహారం ప్రకటించాయి. అంతేకాదు వారి కుటుంబ సభ్యుల్లో ఉద్యోగ కల్పనపై హామీ ఇచ్చాయి. ఆ తరహాలోనే సూరిబాబు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>