రుషికొండ బీచ్‌లో విద్యార్థి గల్లంతు.. హెలికాప్టర్లతో గాలింపు!

కలం, వెబ్ డెస్క్ : విశాఖపట్నంలోని రుషికొండ బీచ్‌ (Rushikonda Beach)లో విషాదం చోటుచేసుకుంది. నగరంలోని బుల్లయ్య కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థులు సరదాగా గడిపేందుకు నిన్న రుషికొండ బీచ్‌కు విహారయాత్రకు వెళ్లారు. వీరిలో నలుగురు విద్యార్థులు సముద్రంలో స్నానానికి దిగారు. ఈ క్రమంలో అలల ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో వారిలో ఒక విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు.

విషయం తెలుసుకున్న అధికారులు నిన్న రాత్రి నుంచే టూరిజం బోట్ల సహాయంతో సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రంతా అన్వేషించినప్పటికీ విద్యార్థి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ రోజు ఉదయం నుంచి అధికారులు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. గల్లంతైన విద్యార్థి కోసం సముద్రంలో ఒక ప్రత్యేక షిప్‌తో పాటు రెండు హెలికాప్టర్ల ద్వారా ముమ్మరంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పర్యాటకులు ఎవరూ నీటిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read : స్టార్ హీరో సింప్లిసిటీ.. జనరల్​ బోగీలో సామాన్యుడిలా ప్రయాణం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>