వైభవ్‌ నన్ను గుర్తు చేస్తున్నాడు: సెహ్వాగ్‌

కలం, స్పోర్ట్స్: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌ తన శైలిని గుర్తు చేస్తోందని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) అన్నారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడాలన్న వైభవ్ ఆలోచనా విధానం తనకు దగ్గరగా ఉందని పేర్కొన్నారు. భారత జట్టులో అతడికి ఎప్పుడు, ఎన్ని అవకాశాలు వస్తాయన్నదే కీలకమని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వయసు కంటే ప్రదర్శనే ముఖ్యమని సెహ్వాగ్ స్పష్టం చేశారు. అండర్‌-19 వంటి వయోపరిమితి టోర్నీల్లో వయసుకు ప్రాధాన్యం ఉంటుందని, ఐపీఎల్‌, భారత జట్టు తరఫున ఆడేటప్పుడు మాత్రం ఆటతీరే కొలమానమని వివరించారు. 15 ఏళ్ల వైభవ్‌తో పాటు 38–40 ఏళ్ల వయసులోనూ విరాట్‌ కోహ్లీ ఆడుతున్న విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు.

2026 జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వైభవ్‌.. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో 246 పరుగులు చేశాడు. 186.16 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసిన అతడు రెండు అర్ధశతకాలు సాధించాడు. అయితే, ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు వైభవ్‌ను ఎంపిక చేయలేదు. సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఓపెనర్లుగా కొనసాగుతున్నారు. దీంతో భారత జట్టులో వైభవ్‌కు తదుపరి అవకాశం ఎప్పుడు వస్తుందన్నది ఇంకా స్పష్టత లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>